తగ్గెది లే.. అంటూ తన అభిమానులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం కెరీయర్ పరంగా హైప్‌లో ఉండి.. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ, క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అయినప్పటికి కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక.. తన గురించి వ్యక్తిగత విషయాలు కూడా పెంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. కెరీర్‌లో ఎదురయే ఒడిదుడుకుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది..
Also Read : Chiranjeevi : చిరంజీవి, అనీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అప్‌డేట్..!
రష్మిక మాట్లాడుతూ.. ‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. ఇది అందరూ గుర్తించాలి. గతంలో నేను ఇదే అంశం గురించి పలుమార్లు మాట్లాడాను. ఒక రోజు మనకు అంతా ప్రశాంతంగా గడిచిపోయిన. మరుసటి రోజు గందరగోళంగా అనిపిస్తుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు ఉండటం నా అదృష్టం. ఒడుదొడుకులను ఎదుర్కోవడంలో ఎప్పుడూ అండగా ఉంటారు. నిజం చెప్పాలంటే నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎంత అదృష్టవంతురాలినో అర్థమవుతుంది. అందుకే కెరీర్ విషయంలో నేను ఎప్పుడూ స్థిరంగా ఉంటాను. అందరికీ ఇచ్చే సలహా కూడా ఇదే మనసుకు నచ్చిన పని చేయాలి. ఎక్కడో కూర్గ్ లాంటి చిన్న పట్టణంలో పుట్టిన నేను..నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే అదే కారణం. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రయాణంలో కఠినమైన పాఠాలు అంటూ ఏం ఉండవు.. అన్నీ విలువైనవే ఉంటాయి. ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి ప్రయత్నించండి కానీ.. ఇతరులను సంతోషపెట్టాలనే భారాన్ని మాత్రం మోయకండి. మీ ఆనందం పై దృష్టి పెట్టండి’ అని రష్మిక సలహా ఇచ్చింది. ఇక ఈ అమ్మడు మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
