Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో

Ram

Ram

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. మాస్, క్లాస్ ఇలా అన్ని రకాలుగా ట్రై చేసిన హిట్ రావడం లేదు. దాంతో ఇక వాళ్ళని వేళ్ళని నమ్ముకునే బదులు తానె రంగంలోకి దిగాలని ఫిక్సయి ఒక భారీ సై-ఫై యాక్షన్  చిత్రంతో రాబోతున్నారు. రామ్ మొదట తానె ఒక కథ రాసుకున్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల రేటింగ్ పరంగా ఈ సినిమాకు వర్క్ చేసాడు. ఆ కథను సన్నిహితులకు వినిపించగా బాగుందనడంతో సరైన దర్శకుడిగా వెతికి ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు.

అలాగే ఈ సినిమాతో నిర్మాణ సంస్థ కూడా స్టార్ట్ చేస్తున్నాడు రామ్. తన అన్న కృష్ణ చైతన్య పోతనేని ఈ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారట. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సామ్ సీఎస్ పేరు వినిపిస్తోంది. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా స్థాయిని పెంచే సామ్ ఈ సై-ఫై యాక్షన్ కథకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మే 15వ తేదీన వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. రామ్ పుట్టినరోజు మే 15 కావడంతో అదే రోజు తన దర్శకత్వ అరంగేట్రం గురించి అనౌన్స్ చేసి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మరి తన సొంత నిర్మాణంలో తానే నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.