మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల ప్లానింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూనే సరైన దర్శకులను సెలెక్ట్ చేసుకుంటుంన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉంటూనే పలు కథలు వింటున్నాడు రామ్ చరణ్. కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు.
వాటిలో ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా రానుంది ఈ సినిమా. గేమ్ ఛేంజర్ షూట్ కంప్లిట్ చేసిన చరణ్ బుచ్చి బాబు సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. ఇందుకోసం బాడీ బిల్డ్ చేసే పనిలో ఉన్నాడు చరణ్. ఇక ఈ సినిమాతో పాటు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినెమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాకనే రామ్ చరణ్ సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా మరోక తమిళ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్. ఖైదీ, విక్రమ్, లియో వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా రానుంది. ఇప్పటికే కథ చర్చలు పూర్తి అయ్యాయి. బుచ్చి బాబు సినిమా తర్వాత లోకేష్ సినిమా ఉంటుంది.