Ramcharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చేసింది.గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఇండియన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.అలాగే గేమ్ ఛేంజర్ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసేందుకు సిద్ధం అవుతన్నాడు.
Read Also :Akhanda 2 : బాలయ్య కు విలన్ గా ఫిక్స్ అయిన ఆ బాలీవుడ్ స్టార్..?
ఇదిలా ఉంటే ఈ నెలలోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలు కానుంది.తాజాగా రాజమండ్రిలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. జూన్ 7 లేదా 9న ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుందని సమాచారం. దాదాపు వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తుంది. సినిమాలలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నట్లు సమాచారం.అయితే ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత దిల్ రాజు కూతురు ఇటీవల తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే గాని రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేలా లేదని తెలుస్తుంది.
