Site icon NTV Telugu

Ramayana : బాలీవుడ్ రామాయణ పై సీఎం ప్రశంసలు.. !

Bollywood Ramayan

Bollywood Ramayan

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్నా బారీ చిత్రాలో ‘రామాయణ’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ సూర్పనక గా కనిపించనున్నారు. లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది కాబట్టి, అన్ని వర్గాల్లో కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. అయితే తాజాగా ఈ మూవీ పై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ప్రశంసలు కురిపించారు..

Also Read : Samantha : సమంతకు స్టేజ్ పైనే ఐ లవ్ యూ చెప్పిన యంగ్ హీరో..

‘భారత్‌లో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. మన కళ, నాటక రంగం, సంగీతం చాలా పురాతనమైనది. వాటికీ తాజాగా సాంకేతికత జోడించాలని అనుకుంటున్నాం. రామాయణ విషయంలోనూ ఇదే జరుగుతోంది. నేను ప్రధానితో కలిసి ఈ సినిమాకు సంబంధించిన సెట్స్‌ను సందర్శించాను. దాని క్వాలిటీ చూసి ఆశ్చర్యపోయాను. కొత్త తరానికి ఇలాంటి కథలు చెప్పడానికి ఇదే సరైన మార్గం. కచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను. ’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version