Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!

Ramayana Vs Dhurandhar 2

Ramayana Vs Dhurandhar 2

Ramayana vs Dhurandhar 2 Collections: నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన తొలి వారంతో పోలిస్తే.. రెండో వారాంతంలో భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇప్పటికే విడుదలైన ఎనిమిదో రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకున్న రామాయణ.. 11వ రోజు నాటికి ఏకంగా రూ.1,384.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్త వసూళ్లలో బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘ధురంధర్ 2’ను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

11వ రోజు వసూళ్లు ఎంతంటే?:


సాక్‌నిల్క్ గణాంకాల ప్రకారం.. 11వ రోజైన ఆదివారం రామాయణ భారతదేశంలో రూ.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా 23,573 షోల ద్వారా ఈ ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు భారత్‌లో ఈ సినిమా రూ.909 కోట్ల గ్రాస్, రూ.760.60 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్‌లో 11వ రోజు రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా.. మొత్తం కలెక్షన్లు రూ.475.50 కోట్లకు చేరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.1,384.50 కోట్లకు పెరిగాయి. భాషల వారీగా చూస్తే.. 11వ రోజు హిందీ వెర్షన్ అత్యధికంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. కన్నడలో రూ.5.75 కోట్లు, తమిళంలో రూ.5 కోట్లు, మలయాళంలో రూ.5 కోట్లు, తెలుగులో రూ.4.75 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.

ధురంధర్ 2ను దాటేసిన రామాయణ:
ప్రపంచవ్యాప్త వసూళ్ల విషయంలో రామాయణ మరో భారీ రికార్డును ఖాతాలో వేసుకుంది. 11వ రోజు నాటికి రూ.1,384.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో ధురంధర్ 2ను అధిగమించింది. ధురంధర్ 2 ఇదే 11వ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.1,354.92 కోట్ల వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్ గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారింది.

రెండో వారాంతంలో భారీ జోరు:
రామాయణ తొలి రోజు భారత్‌లో రూ.64.85 కోట్ల నెట్ వసూళ్లతో శుభారంభం చేసింది. శుక్రవారం రూ.48.05 కోట్లు రాబట్టగా.. శనివారం రూ.69.80 కోట్లతో దూసుకెళ్లింది. ఆదివారం రూ.56.15 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే రెండో వారాంతానికి వచ్చేసరికి సినిమా కలెక్షన్లు మరింత పుంజుకున్నాయి. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ గణాంకాల ప్రకారం.. రెండో శనివారం వసూళ్లు తొలి శనివారం కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి స్పందన, మౌత్ టాక్ కారణంగా సినిమా వసూళ్లు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రూ.1,000 కోట్ల క్లబ్‌లో ఫాస్టెస్ట్ ఎంట్రీ:
విడుదలైన కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల మార్కును అందుకున్న రామాయణ.. వేగవంత వేగంగా ఈ ఘనత సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ‘దంగల్’, ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’, ‘ధురంధర్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘జవాన్’, ‘పఠాన్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలు ఉన్నాయి. బాహుబలి 2కి ఈ మైలురాయిని చేరుకోవడానికి 10-11 రోజులు పట్టగా.. రామాయణ ఎనిమిది రోజుల్లోనే సాధించింది. అయితే ధురంధర్ 2, పుష్ప 2 కేవలం ఏడు రోజుల్లోనే రూ.1,000 కోట్ల మార్కును అందుకున్నాయి.