Site icon NTV Telugu

Ramayana : బాలీవుడ్ ‘రామాయణ’ పార్ట్ 2 అప్‌డేట్ !

Bollywood Ramayan

Bollywood Ramayan

తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఇప్పటికే చాలా సార్లు రామాయణం ఇతిహాసాలు సినిమా రూపంలో, సీరియల్ రూపంలో చిన్ననాటి నుండి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రామాయణం కొత్త తరం వారికి కొత్తగా చూపించాలి అనే ఉద్దేశంతో రకరకాల తెరకెక్కిస్తునే ఉన్నారు. దీంతో చిన్న నుంచి పెద్ద వరకు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రామాయణం ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో హిట్‌ దక్కలేదు.. అందులోను రామాయణం‌ను వక్రీకరించినట్లుగా కొందరు విమర్శించారు. కాగా ఇప్పుడు మరోసారి రామాయణం పట్టాలెక్కుతోంది. ఈసారి ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీగా బాలీవుడ్ లో ‘రామాయణం’ రాబోతుంది.

Also Read: Vikram : ‘వీర ధీర శూర‌న్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!

స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ లేటెస్ట్ మూవీలో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తుండగా.. రావణుడి పాత్రను యశ్ పోషిస్తున్నారు. సూర్పనక గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. బాబీ దేఓల్ కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా తొలి భాగం శరవేగంగా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, తాజాగా ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మే నెల ఆఖరి నుంచి ‘రామాయణ పార్ట్ 2’ చిత్రీకరణ మొదలు కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ముందుగా సీత పాత్రకు సంబంధించి, అశోక వనం ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారని.. జూన్ నుంచి రణ్ బీర్ రాముడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తారని సమాచారం. అలాగే వీళ్లిద్దరి రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది దీపావళి రానుండగా.. రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుందట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version