Site icon NTV Telugu

Ram Pothineni : ఈసారి మాస్ కాదు, క్లాస్ ఫీలింగ్‌తో సినిమా చేశా..

Rampothineni

Rampothineni

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ లభించింది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌ పోతినేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Thiruveer : ‘సలార్‌’ లో విలన్‌ ఛాన్స్ మిస్‌ అయ్యా..

రామ్ మాట్లాడుతూ.. “ఇటీవల చాలా సినిమాలు హింసాత్మకంగా మారిపోయాయి. ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి కొంత పాజిటివ్ ఫీలింగ్‌ తీసుకెళ్లే సినిమాలు ఇప్పుడు అరుదుగా వస్తున్నాయి. అందుకే ఈసారి సౌమ్యమైన, భావోద్వేగాలతో నిండిన కథను ఎంచుకున్నాను. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అలాంటి హృదయానికి హత్తుకునే కథ. ఇందులో నేను చేసే పాత్ర ప్రేక్షకులందరికీ దగ్గరగా అనిపిస్తుంది,” అని తెలిపారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమా ఇదని రామ్‌ పేర్కొన్నాడు. ఇక సినిమాపై బజ్‌ రోజురోజుకీ పెరుగుతుండగా, అభిమానులు కూడా రామ్‌ ఎలాంటి న్యూ అవతార్‌లో కనిపించబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Exit mobile version