Site icon NTV Telugu

Andhra King Taluka: రామ్ రాసిన పాటని అనిరుధ్ పాడితే?

Ram

Ram

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అప్ కమింగ్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో రిఫ్రెషింగ్ అవతార్ లో కనిపించనున్నారు. ఇందులో అతను సినిమా అభిమానిగా అలరించనున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలకమైన నెల రోజుల షెడ్యూల్ జరుగుతోంది.

Also Read:Prabhas : ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామన్న స్టార్ హీరోయిన్లు..

ఆంధ్ర కింగ్ తాలూకాలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. వివేక్ – మెర్విన్ ద్వయం స్వరపరిచిన సౌండ్‌ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ని అలరించనున్నారు. ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ జూలై 18న విడుదల అవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సాంగ్ రామ్ రాయగా సంగీత సంచలనం అనిరుధ్ పాడినట్టు తెలుస్తోంది. ట్రాక్ కోసం ప్రమోషనల్ పోస్టర్‌లో రామ్ ఉత్సాహంగా తెరచాపతో నాటు పడవపై ప్రయాణిస్తున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది.

Also Read:Premante: సైలెంటుగా ‘ ‘ప్రేమంటే’ అంటున్న ప్రియదర్శి

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని, శ్రీకర్ ప్రసాద్‌ ఎడిటింగ్, అవినాష్ కొల్లా పొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో పాటు మ్యూజిక్ ప్రమోషన్‌లు ప్రారంభం కానుండటంతో మేకర్స్ సినిమాకి వున్న సెలబ్రేషన్ మూడ్‌కి తగ్గట్టు ఫుల్ జోష్ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కి రెడీ అవుతున్నారు.

Exit mobile version