Peddi Trailer Release Date: ‘పెద్ది’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్ మాత్రం ఇక్కడ కాదండోయ్!
- మోస్ట్ అవేటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'
- జూన్ 4న పెద్ది సినిమా రిలీజ్
- పెద్ది ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan’s Peddi Trailer Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అదిరిపోయే ప్లాన్లతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. పెద్ది ట్రైలర్‌ను మే 16న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ట్రైలర్ ఈవెంట్‌ను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సహా చిత్ర యూనిట్ హాజరు కానుందని టాక్. నార్త్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ లొకేషన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌ను కేవలం ఒక సినిమా వేడుకలా కాకుండా.. ఒక మ్యూజికల్ ఫెస్టివల్‌లా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నారట.
Also Read
అయితే పెద్దిట్రైలర్ లాంచ్ డేట్, ఈవెంట్ ఎక్కడ? అనే విషయాల్లో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ బుచ్చిబాబు మాత్రం పెద్ది ట్రైలర్‌ను ఓ రేంజ్‌లో కట్ చేసినట్టుగా సమాచారం. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ట్రైలర్ వచ్చాక అది నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందని ఇండస్ట్టీ ఇన్‌సైడ్ టాక్. మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న పెద్ది.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!