Site icon NTV Telugu

Peddi : ‘పెద్ది’లో రామ్ చరణ్ యాక్టింగ్‌పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్..

Peddi

Peddi

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా “పెద్ది”. స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కెుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబధించిన తాజా అప్‌డేట్‌ను మేకర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, మరోవైపు షూటింగ్‌కు సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాల్ని కూడా జరుపుతున్నామని తెలిపింది. ప్రపంచంలోని వివిధ దేశాలు, భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా ఒక అవార్డ్ ఫంక్షన్‌లో హాజరైన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Also Read : Dhanush : మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో ధనుష్ న్యూ ప్రాజెక్ట్ !

ఈ సినిమాతో రామ్ చరణ్ మరో కొత్త కోణాన్ని తన నటనతో చూపించబోతున్నారు. రంగస్థలం సినిమాటోగ్రఫర్ తెలిపారు. దీంతో తన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. రత్నవేలు తెలిపారు, సినిమా ఇప్పటికే 50 శాతం పూర్తి అయ్యిందని, బలమైన స్క్రిప్ట్ వలన సినిమాను సాధారణంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో షూట్ చేస్తున్నారు అని. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి.ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ కోసం మరింత ఎగసిపోతున్నారు. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్, రామ్ చరణ్ కొత్త నటనా కోణం చూపించనున్న తీరును చూడాలని వారు ఎదురుచూస్తున్నారు.

Exit mobile version