Chiru-Charan: ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో, మెగా కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ కొంత ఆందోళన నెలకొంది. అయితే, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా డాక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సమయంలో తమకు కలిగిన ఆందోళనను డాక్టర్ తన మాటలతో, పనితనంతో పోగొట్టారని ఆయన వివరించారు.”డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు, చరణ్ కంటికి మీరు ఎంతో నైపుణ్యంతో, సకాలంలో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. తొలుత మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ.. మీరు చెప్పిన మాటలు మా భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చాయి. సకాలంలో స్పందించి చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు” అని చిరంజీవి పేర్కొన్నారు.
Also Read: Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
తండ్రిగా తన కొడుకు ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను, వైద్యుడిపై ఉన్న గౌరవాన్ని ఈ పోస్ట్ ద్వారా చిరంజీవి చాటుకున్నారు. సర్జరీ విజయవంతం కావడంతో రామ్ చరణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ల సూచనల మేరకు కొద్దిరోజుల విరామం తర్వాత ఆయన తిరిగి ‘పెద్ది’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అయితే, మెగాస్టార్ స్వయంగా అప్‌డేట్ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుని, సోషల్ మీడియాలో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పెద్ది టీమ్ కూడా స్పందించింది. చరణ్ తిరిగి షూటింగ్‌లో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలిపింది. గాయం చిన్నదే కావడంతో సినిమా పనులకు పెద్దగా ఆటంకం కలగదని రామ్ చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ భావిస్తోంది. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కానుండగా.. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Peddi: గెట్ రెడీ గాయ్స్.. ‘పెద్ది’ కుస్తీ పట్టు చూస్తారా?
Dr. Sudhakar Prasad garu,
Your timely and skilful surgery on Charan’s eyelid has truly been a blessing. What was a moment of concern for us was eased entirely by your precision, care, and expertise.Your craftsmanship made all the difference, and we are truly grateful.
Thank… pic.twitter.com/j53rRIpOKB— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2026
