Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. తమ ముగ్గురు చిన్నారులతో కలిసి కృష్ణుడిని పూజిస్తున్న ఫోటోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ ఫోటోను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు కన్నయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో కొణిదెల కుటుంబం కూడా ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. చిన్నారులను కృష్ణుడు, రాధారాణి వేషధారణలో ముస్తాబు చేసి, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉపాసన షేర్ చేసిన ఫోటోలో చిన్నారుల ఫేస్ రివీల్ చేయలేదు. కానీ ఆ ఫోటోను సరిగ్గా గమనిస్తే శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో పిల్లలను రెడీ చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. రామ్ చరణ్ – ఉపాసన తమ పిల్లలతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఈ ఫ్యామిలీ మూమెంట్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఉపాసన కొణిదెల తమ ఇంటికి చిన్న కృష్ణుడు, రాధారాణి విచ్చేసినట్లుగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని కూడా పంచుకున్నారు. ప్రేమ, ఆనందం, దైవుడి ఆశీస్సులతో తమ ఇంట్లో జన్మాష్టమి వేడుకలు జరిగాయని ఆమె వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో RC 17 సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఉపాసన కూడా తమ కుటుంబంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా జన్మాష్టమి సందర్భంగా కొణిదెల ఇంటి నుంచి వచ్చిన ఈ స్పెషల్ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?