NTV Telugu Site icon

Ram Charan : ఢిల్లీకి రామ్ చరణ్.. ఎందుకంటే..?

Rc 16

Rc 16

మెగా పవర్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో కాస్త చేదు ఫలితాన్ని ఇచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ కు మెగాభిమానులను నిరుత్సహపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌ లో ఈ సినిమా రాబోతోందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : NTRNeel : డ్రాగన్ రాక.. కాస్త ఆలస్యం

ఈ సినిమా షూటింగ్ ను గతేడాది నవంబరులో కర్ణాటకలోని మైసూరులో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు. సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్యలో చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ కు విరామం ఇచ్చిన యూనిట్ మరో భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తుంది. తర్వాతి షెడ్యూల్ కోసం త్వరలో ఢిల్లీ వెళ్లనుంది RC 16 టీమ్. అక్కడ కొన్ని కీలకమైన సీన్స్ ను తీయబోతున్నారు. రామ్ చరణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. మరోవైపు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు ఇప్పటికే మూడు సాంగ్స్ ఇచ్చారట. విన్న వాళ్ళు సూపర్బ్ అంటున్నారట. మొదటి సినిమాకి సాంగ్స్ బాగా ప్లస్ అయ్యాయో, ఇప్పుడు  సినిమాకి కూడా మ్యూజిక్ బిగ్ ప్లస్ అవ్వబోతుందని టాక్. ఈ నెల 27 రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్సీ 16 టైటిల్ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.