NTV Telugu Site icon

Unstoppable With NBK S4: బాలయ్యతో రామ్ చరణ్.. మాములుగా ఉండదు మరి!

Ram Charan Balakrishna

Ram Charan Balakrishna

ఒకపక్క నందమూరి అభిమానులతో పాటు మరోపక్క మెగా అభిమానులు కూడా సంబరపడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వాస్తవానికి ఒకప్పుడు మెగా వెర్సెస్ నందమూరి అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకపక్క తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడంతో ఆయా పార్టీల అభిమానులు, మెగా నందమూరి అభిమానులు సైతం కలిసి మెలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే నాలుగో సీజన్ ఎపిసోడ్ కోసం రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా వచ్చే నెల 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతానికి స్టార్ సినిమాలు ఏవైనా సరే ప్రమోషన్ కోసం బాలకృష్ణ షోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం వెళ్లబోతున్నట్లుగా ముందు ప్రచారం జరిగింది.

Akhanda 2 : అఖండ 2 సెట్స్ టు అన్ స్టాపబుల్ సెట్స్.. బాలయ్య మస్త్ బిజీ !

అదే విషయాన్ని ఆహా వీడియో సంస్థ అధికారిక ప్రకటన చేసేసింది. ఒరేయ్ చిట్టిబాబు వస్తున్నాడు రీసౌండ్ ఇండియా అంతా వినపడేలా చేయండి అంటూ ఆహా ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చింది. దీంతో నందమూరి బాలకృష్ణ షో కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రాబోతున్నాడు అంటూ మెగా అభిమానులు ఇప్పటికే ఒక రేంజ్ లో ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నందమూరి బాలకృష్ణ షోకి వచ్చిన వారందరితో బాగా క్లోజ్ అవుతూ వారి పర్సనల్ విషయాలను ఎవరికీ తెలియని విషయాలను ప్రేక్షకులకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మెగా పవర్ స్టార్ నుంచి ఎలాంటి విషయాలు రాబడతారో చూడాల్సి ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ షోకి సినిమా టీం లోని కొందరితో పాటు రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన సైతం హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది..

Show comments