NTV Telugu Site icon

అభిమానుల అంకితభావానికి చరణ్ ఫిదా

Ram Charan thanks fans for their charity during pandemic

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానుల అంకితభావానికి ఫిదా అయ్యారు. ఈ మేరకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో, థాంక్స్ నోట్ కూడా పోస్ట్ చేశారు. మెగా అభిమానులు కోవిడ్ -19 మహమ్మారి కాలంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు. వారి శక్తి మేరకు వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తున్నారు. “అభిమానులు ఈ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కష్టపడి పని చేస్తున్న ఆ సమాజ సేవ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకితభావంతో పని చేశారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికి నా శుభాభినందనలు. మీ అందరి అంకిత భావానికి ధన్యవాదాలు” అంటూ ఈ వీడియోను జత చేశారు చరణ్. ఇక తమ అభిమాన హీరో నుంచి అభినందనలు అందడంతో సంతోషంలో తేలిపోతున్నారు మెగా అభిమానులు. కాగా ఈ క్లిష్టమైన సమయంలో రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించిన విషయం తెలిసిందే.