kajal Aggarwal: మగధీర సెట్‌లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!

Adhika Masa Purnima (2)

Adhika Masa Purnima (2)

kajal Aggarwal: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మగధీర’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌పై జరిగిన ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీక్రెట్‌ను కాజల్ అగర్వాల్ తాజాగా బయటపెట్టింది. షూటింగ్ గ్యాప్‌లో రామ్ చరణ్ తనను ఎలా ఆటపట్టించేవాడో గుర్తుచేసుకుంటూ కాజల్ పంచుకున్న ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.. మగధీర సినిమాలో గుర్రపు స్వారీ సీన్లు ఎంత ఫేమస్సో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ తన సొంత గుర్రం ‘బదల్’ను షూటింగ్‌కు తీసుకొని వచ్చాడు. షూటింగ్ బ్రేక్‌లో తనను గుర్రంపై ఊరేగించడం ఒకెత్తయితే, ఆ తర్వాత చరణ్ చేసిన అల్లరి మరో ఎత్తు అని అన్నారు. సెట్‌పై తాను ఎప్పుడు కనిపించినా రామ్ చరణ్ తన గుర్రం పేరు “బదల్… బదల్…” అని పదేపదే గట్టిగా పిలుస్తూ తనను టీజ్ చేసేవాడని చెప్పుకొచ్చారు. ఆ టైంలో చరణ్ చేసిన ఫన్నీ కామెంట్లు, ఆటపట్టించిన విధానం ఇప్పటికీ తన గుండెల్లో గుర్తిండిపోయాయని కాజల్ నవ్వుతూ చెప్పుకొచ్చింది. మగధీర లాంటి భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమా షూటింగ్ అంత ఒత్తిడిలో జరుగుతున్నా, రామ్ చరణ్ మాత్రం సెట్స్‌ను ఇంత సరదాగా, హ్యాపీగా ఉంచేవాడని ఈ ముచ్చట విన్నాక మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చరణ్ నిజంగానే ‘సెట్ మాస్టర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

×
×
Ad