NTV Telugu Site icon

Ram Charan : గేమ్ ఛేంజర్ రిలీజ్ పై తర్జన భర్జన..

Game Chenjar (2)

Game Chenjar (2)

మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్  నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల రిలీజ్ అయిన రా మచ్చ లిరికల్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై తర్జన భర్జనలు నడుస్తున్నాయి. మొదటి ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 20న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం అని ఫీలర్లు వదిలారు. కొన్ని రోజుల తర్వాత లేదు క్రిస్టమస్ పండగ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ చేస్తాం అని మరోక ఫీలర్ వదిలారు. ఈ తరుణంలో ఏదేమైనా డిసెంబరు మాత్రం రిలీజ్ పక్క అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మొన్నామధ్య విశ్వంభర సమ్మర్ కు వెళ్తుంది గేమ్ ఛేంజర్ ను సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేస్తారు అని మరో గాసిప్ వినిపించింది. ఫెస్టివల్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు రావడం కరెక్ట్ అని భావించారు డిస్ట్రిబ్యూటర్లు.కానీ క్రిస్టమస్ రిలీజ్ ఫిక్స్ అని సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేయడంతో డిసెంబరులోనే వస్తుంది అని అనుకున్నారు. ఇప్పుడు మరలా సంక్రాంతికే గేమ్ ఛేంజర్ అని మరొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ రూమర్స్ కు చెక్ పడేది ఎపుడో సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో దిల్ రాజుకే తెలియాలి