గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు (ఓపెనింగ్) సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన దొంగ నా కొడుకు ఈవెంట్లో మౌళి ‘RC 17’ అప్‌డేట్ గురించి సరదాగా అడగ్గా, రవిశంకర్ స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను దసరా పండుగ రోజే అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని భావించారట. అయితే ఆ సమయంలో మూఢం ఉండటం వల్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ అడ్డంకులు తొలగిపోవడంతో, ఈ నెలాఖరులో అంటే 26 లేదా 27వ తేదీన మంచి ముహూర్తం చూసుకుని సినిమాను ఘనంగా ప్రారంభించనున్నట్లు వై. రవిశంకర్ వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు, సినీ ప్రియులకు ఈ న్యూస్ అదిరిపోయే కిక్ ఇస్తోంది!

