Site icon NTV Telugu

ముంబైలో రామ్ చరణ్ బీచ్ సైడ్ హౌజ్… గృహ ప్రవేశం కూడా…!!?

Ram Charan purchased luxurious sea facing bungalow in Mumbai

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నారనే వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల ప్రకారం చరణ్, ఉపాసన దంపతులు ముంబైలోని ఖార్ ప్రాంతంలో విలాసవంతమైన బీచ్ సైడ్ హౌజ్ ను కొనుగోలు చేశారట. అయితేకాదు ఈ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం కూడా జరిగిపోయింది అంటున్నారు. అయితే చరణ్ ముంబైలో ఇల్లు కొనడానికి ప్రత్యేక కారణం ఉందట.

Read Also : హనుమాన్ గుడిని నిర్మించిన స్టార్ హీరో… ఘనంగా ప్రారంభోత్సవం

ఇటీవల కాలంలో సినిమాల విషయమై ముంబైకి ఆయన రాకపోకలు బాగా పెరిగిపోయాయి. అయితే వచ్చిన ప్రతిసారీ హోటల్లో గడపాల్సి వస్తోందట. “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ లో కొంతభాగం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా “ఆర్ఆర్ఆర్” పాన్ ఇండియా మూవీ. కాబట్టి ఈ చిత్రం తరువాత చరణ్ బాలీవుడ్ లో కూడా నటించే అవకాశం లేకపోలేదు. ఈ కారణాల దృష్ట్యా ముంబైలో అద్భుతమైన బీచ్ సైడ్ ఇల్లు కొన్నారట. అయితే ఈ విషయంపై ఇంకా మెగా ఫ్యామిలీ స్పందించలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తన రాబోయే రెండు చిత్రాలైన “ఆర్ఆర్ఆర్”, “ఆచార్య”ల కోసం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలావుండగా ప్రస్తుతం రెండు బాలీవుడ్ ప్రాజెక్టులలో నటిస్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా ముంబైలో ఒక ఇల్లు కొన్న విషయం తెలిసిందే.

Exit mobile version