Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan Peddi Release Date June 4 Sukumar Speech

Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్

Published Date :May 1, 2026 , 6:58 pm
By Shiva Ganesh
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ చిత్ర రిలీజ్ తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్‌లో చిత్ర సమర్పకులు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం జూన్ 4న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఉప్పెన క్లైమాక్స్ చూసినప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడు అనిపించింది. బుచ్చిబాబు పెద్ది కోసం మంచి స్క్రిప్ట్ రాశాడు. ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. అలాంటి బ్యాలెన్స్ పట్టుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. పెద్ది లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్యకాలంలో రాలేదు. స్క్రీన్ పై సాంగ్స్ చూసినప్పుడు సినిమా వేరే లెవెల్‌లో అనిపించింది.

Also Read

  • Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
  • Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
  • Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
  • Getup Srinu: "తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్".. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..

రత్నవేలు గ్రేట్ విజువల్స్ ఇచ్చారు. చరణ్‌ని అద్భుతంగా చూపించినందుకు థాంక్యూ. మొన్న వచ్చిన టీజర్ విజువల్స్ మామూలుగా లేవు. సతీష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన మొదటి సినిమాకే రామ్ చరణ్ లాంటి హీరో, బుచ్చిబాబు లాంటి దర్శకుడు దొరకడం ఆయన అదృష్టం. చరణ్ డాన్స్ చూస్తుంటే మాటలు రావడం లేదు.. అంత అద్భుతమైన ఎనర్జీతో డాన్స్ చేశాడు. ‘పెద్ది’లో చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలం ను దాటి నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. బుచ్చిబాబు, సతీష్ గారికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌కు థాంక్యూ. ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా థాంక్యూ.

జూన్ 4న సినిమా విడుదల అవుతోంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. హిందీలో జియో వారు విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా భారీ రిలీజ్ ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సినిమాను సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • buchi babu sana
  • Peddi Movie Release Date
  • Ram Charan Dance in Peddi.
  • Ram Charan Peddi movie
  • Sukumar Speech Peddi Press Meet

తాజావార్తలు

  • Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు

  • Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..

  • Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?

  • Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్

  • Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions