Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సన కాంబినేషన్లో రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న.. మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ (PEDDI) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే తన బిజినెస్‌తో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ (టీవీ ప్రసార) హక్కులకు సంబంధించిన ఒక సాలిడ్ డీల్ క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఘనవిజయం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పక్కా విలేజ్ రస్టిక్ డ్రామా కావడంతో ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఫిలిం నగర్ ట్రేడ్ వర్గాల ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘పెద్ది’ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ‘జీ తెలుగు’ (Zee Telugu) ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. రామ్ చరణ్ క్రేజ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు స్క్రిప్ట్‌పై ఉన్న నమ్మకంతో ‘జీ’ సంస్థ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్లో భారీ మొత్తాన్ని చెల్లించి ఈ హక్కులను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రన్ ముగిసిన తర్వాత బుల్లితెరపై మెగా పవర్ స్టార్ మాస్ రాంపేజ్ జీ తెలుగులోనే సందడి చేయనుంది.
Also Read
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!