Peddi : థియేటర్లలో ‘పెద్ది’ సరికొత్త రచ్చ.. రేపటి నుంచి 6 నిమిషాల కొత్త సీన్స్ లోడింగ్,
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన వైవిధ్యభరిత చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2026 నాటి సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు, చూడబోయే ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఒక బిగ్ షాకింగ్ అండ్ క్రేజీ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సాధారణంగా సినిమా విడుదలయ్యాక లెంగ్త్ ఎక్కువైతే సీన్లు కత్తిరించడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం మేకర్స్ రివర్స్ గేర్ వేశారు. థియేటర్లలో ఈ చిత్రానికి వస్తున్న భారీ రెస్పాన్స్ చూసి, ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి ఏకంగా 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల సరికొత్త సీన్లను రేపటి నుంచే అదనంగా యాడ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను కూడా పేరుతో విడుదల చేశారు.
సినిమాకు అదనంగా జోడించబోయే ఈ కొత్త సీన్లకు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. అంటే రేపటి నుంచి థియేటర్లలో సరికొత్త ఎడిటింగ్‌తో కూడిన ‘పెద్ది’ రన్ కాబోతోంది. ఏ ఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో, రత్నవేలు విజువల్స్ తో కూడిన ఈ సరికొత్త సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త హై ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ అప్డేట్లో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. సినిమాలో హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని పాత సీన్లను ఎడిటింగ్‌లో తొలగించినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న కొన్ని సీన్లను లేపేసి, వాటి స్థానంలో మరింత ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే కొత్త డ్రామాను, సీన్లను రీ-ప్లేస్ చేశారనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. కథ మరింత వేగంగా, ఆసక్తికరంగా సాగడానికే ఈ కీలక మార్పులు చేసినట్లు సమాచారం. ఒకపక్క రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ‘పెద్ది’, ఇప్పుడు ఈ 6 నిమిషాల కొత్త సీన్ల తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- Varanasi Movie Update: 'వారణాసి'కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
- Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. 'బెత్లేహెమ్ కుటుంబ యూనిట్' బ్లాక్ బస్టర్
- Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
తాజావార్తలు
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!