Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Deleted Scenes: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ ఎమోషనల్ హిట్‌గా దూసుకుపోతోంది. అయితే సినిమాలో రావు రమేష్, జగపతి బాబు, సత్యా లాంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ.. వారికి కేవలం సింగిల్ డైలాగ్స్ లేదా ప్యాడింగ్ ఆర్టిస్టుల లాంటి చిన్న పాత్రలే ఇచ్చారనే అసంతృప్తి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ బుచ్చిబాబు స్పందించారు. సెకండ్ హాఫ్ రన్‌టైమ్ (లెంగ్త్) ఎక్కువ అవ్వడం వల్ల ఎడిటింగ్‌లో లేచిపోయిన కొన్ని మైండ్‌బ్లోయింగ్ సీన్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
థియేటర్లు షేక్ అయ్యే సీన్!
సినిమాలో రావు రమేష్ హీరో బ్యాక్‌డ్రాప్‌ను నిలదీసే ఒక అదిరిపోయే పొలిటికల్ పెళ్లిచూపుల సీన్ ఉందట. ఆ సీన్ గురించి బుచ్చిబాబు చెప్తూ.. “హీరో కంటే తన కూతురు కులం, హోదా, ఆస్తిలో చాలా ఎక్కువ. అలాంటిది ఆమె ఒక సాదాసీదా వాడిని పెళ్లి చేసుకుంటానంటే.. ఒక రాజకీయ నాయకుడిగా రావు రమేష్ క్యారెక్టర్ నిలదీస్తుంది. ‘22,342 మంది మగ ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో.. పోయి పోయి ఓటెక్కనోడు దొరికాడా నీకు?’ అని రావు రమేష్ అడిగితే.. దానికి కౌంటర్‌గా ‘అల్లుడు ఎంత తక్కువైతే, సమాజంలో నాకు అంత ఎక్కువ మర్యాద’ అని ఒక పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్ ఉంటుంది. ఆ సీన్ గనుక సినిమాలో ఉండి ఉంటే థియేటర్లు పేలిపోయేవి. కానీ, సెకండ్ హాఫ్ లెంగ్త్ వల్ల కట్ చేయాల్సి వచ్చింది” అని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
యూట్యూబ్‌లో రిలీజ్ ప్లాన్
అలాగే సీనియర్ నటుడు జగపతి బాబు క్యారెక్టర్‌కు సంబంధించి కూడా ఎడిటింగ్‌లో కొన్ని కీలకమైన సంభాషణలు కట్ అయ్యాయని బుచ్చిబాబు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన చనిపోయే ముందు స్టేజ్ మీద చెప్పే.. ‘ఉచ్చను కూడా ఒంట్లో దాచుకోవాలిరా అమ్మ బతుకు’ అనే డైలాగ్ వెనుక ఒక పవర్ఫుల్ సీన్ ఉందట. ఫస్ట్ హాఫ్‌లో విజయనగరం కొండ కింద ఊరి జనంపై జరిగే అవమానాలకు కౌంటర్‌గా వచ్చే ఈ డైలాగ్స్ సినిమా రన్‌టైమ్ పరిమితుల వల్ల తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టుల నటనను ప్రేక్షకులు మిస్ కాకూడదనే ఉద్దేశంతో.. ఎడిటింగ్‌లో కట్ అయిన ఈ ‘డిలీటెడ్ సీన్స్’ మొత్తాన్ని త్వరలోనే అఫీషియల్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!