Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన పవర్ఫుల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో అస్సలు తగ్గడం లేదు. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం వచ్చేసరికి కలెక్షన్ల జోరు తగ్గుతుంది. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనంగా ఈ చిత్రం 18వ రోజున కూడా థియేటర్లను షేక్ చేస్తోంది.
ఈ సినిమాకు థియేట్రికల్ రన్లో అందుతున్న అపూర్వ ఆదరణకు ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచాయి. నిన్న ఒక్క రోజే ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’లో ఏకంగా 50 వేల టికెట్లు అమ్ముడవడం చూస్తుంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని ‘పెద్ది’ మరోసారి నిరూపించింది. ఈ గురువారం నుండి థియేటర్లలో అదనంగా జోడించిన సరికొత్త సీన్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాను ఇప్పటికే చూసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు సైతం ఆ కొత్త సీన్లను వెండితెరపై చూసి ఎంజాయ్ చేయడానికి ‘రిపీట్ ఆడియన్స్’ గా మళ్లీ మళ్లీ థియేటర్ల మెట్లు ఎక్కుతున్నారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఇటీవలి కాలంలో విడుదలైన ఏ పెద్ద సినిమా కూడా మూడో వారంలోకి అడుగుపెట్టాక ఇంతటి అసాధారణమైన మొమెంటం, హోల్డ్‌ను కనబరచలేదు. రామ్ చరణ్ వన్-మ్యాన్ షో, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులకు థియేటర్లలో ఒక పర్ఫెక్ట్ లూప్‌ను క్రియేట్ చేశాయి. ఈ రేర్ ఫీట్ చరణ్ బాక్సాఫీస్ వేటను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. కేవలం టాక్ మాత్రమే కాదు, సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ తోడైతే రామ్ చరణ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత కోస్తుందో చెప్పడానికి ఈ 18వ రోజు కలెక్షన్ల జంపే ఒక నిదర్శనం! లోకల్ మార్కెట్ లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!