గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా అయితే చదివేయండి. నిజానికి రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ సుకుమార్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ మరింత సమయం పట్టేలా ఉంది. ఈలోపు మరో సినిమా చేయాలని రాంచరణ్ ప్రయత్నిస్తున్నాడు తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ బిజీగా ఉండడంతో ఆయన బాలీవుడ్ వైపు కూడా దృష్టి సారించారు. ఈ సమయంలోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్, రామ్ గోపాల్ వర్మకి సన్నిహితుడైన మధు మంతెన రామ్ చరణ్ తేజ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
SSMB 29: ‘ఇండియానా జోన్స్’ పోయి ‘హనుమాన్’ వచ్చే.. అసలేం చేస్తున్నారు మాష్టారూ?
నిజానికి రాంచరణ్ కి మధు మంతెనతో మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది. ముంబై వెళ్ళినప్పుడు అలా రామ్ చరణ్ దాదాపుగా మధు మంతెనను కలవకుండా తిరిగిరారు. ప్రస్తుతానికి మధు మంతెన ఒక స్క్రిప్ట్ రామ్ చరణ్ కోసం సిద్ధం చేయించాడట. ఒకరిద్దరు హిందీ డైరెక్టర్లు ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ మధు మంతెన నిర్మాతగా ఈ సినిమా రూపాంతరం చెందే అవకాశం ఉంది. అన్ని కరెక్ట్ గా కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేసి సుకుమార్ సినిమా కంటే ముందు ఈ సినిమా పట్టాలెక్కించే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ఏమవుతుంది అనేది.