Site icon NTV Telugu

Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌ పై ప్రశంసలు కురిపించిన.. హృతిక్ మాజీ భార్య

Ram Charan,sussanne,

Ram Charan,sussanne,

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆమె హైద‌రాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తోంది. సుసానే ..షారూక్ భార్య గౌరీఖాన్ తో క‌లిసి ప‌లు వ్యాపారాల‌లో భాగ‌స్వామిగా ఉంది. ప్రజంట్ వారు త‌మ వ్యాపారాన్ని హైద‌రాబాద్‌కి విస్తరించాల‌ని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైద‌రాబాద్ లో మొట్టమొద‌టి చార్ కోల్ స్టోర్‌ని సుసానే ప్రారంభించారు. అయితే ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా హాజ‌ర‌య్యాడు.

Also Read: Ram Pothineni : రామ్ పోతినేని తో డేటింగ్.. రింగ్ తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

అంతేకాదు తాజా సమాచారం ప్రకారం సుసానే, ఆమె సోద‌రుడు జాయేద్‌ఖాన్ ల‌కు త‌న ఇంట్లో ఆతిథ్యం కూడా ఇచ్చాడు చరణ్. దీనికి ఉబ్బిత‌బ్బిబ్బయిన సుసానే, జాయేద్ అత‌డి ప్రేమభిమానాని రామ్ చ‌ర‌ణ్‌పై ప్రశంస‌ల జ‌ల్లు కురిపించారు.. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పంచుకుంటూ.. ‘రియ‌ల్ సూప‌ర్ స్టార్, లెజెండ్’ అంటూ చ‌ర‌ణ్‌ ని ఆకాశానికి ఎత్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటీ అంటే రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల ముంబై సెల‌బ్రిటీల‌తో ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడట. ఎందుకంటే త‌న వ్యాపార కార్యక‌లాపాల‌ని ముంబైలోను డెవలప్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే చ‌ర‌ణ్ ..హైద‌రాబాద్ కి విచ్చిన ముంబై ప్రముఖుల‌కు ఆతిథ్యం ఇవ్వడం, వారికి తెలుగు వారి వంట‌కాల్ని రుచి చూపించి వారి ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ని అందుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే.. బాలీవుడ్ హీరోలు స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బ‌చ్చన్ స‌హా ఎంద‌రో స్టార్లకు వారు ఆతిథ్యం ఇచ్చారు.

 

Exit mobile version