Site icon NTV Telugu

Ram Charan : శ్రీలంకకు రామ్ చరణ్!

Peddi, Ram Charan, Janhvi Kapoor, Buchi Babu Sana, A. R. Rahman

Peddi, Ram Charan, Janhvi Kapoor, Buchi Babu Sana, A. R. Rahman

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది కోసం శ్రీలంకకు బయల్దేరారు. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చి బాబు సానా శ్రీలంకకు బయల్దేరారు. సమాచారం ప్రకారం, రేపటి నుండే అక్కడ పెద్ది షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read :Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది మావా ఈ రచ్చ?

ఈ శ్రీలంక షెడ్యూల్‌లో, టీమ్ పెద్ది కొన్ని కీలకమైన సన్నివేశాలను, ఒక పాటను చిత్రీకరించనుంది. శ్రీలంకలోని అద్భుతమైన లొకేషన్లలో హీరో చరణ్, హీరోయిన్ జాన్వీ కాంబినేషన్లో ఈ పాటను షూట్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మ్యూజికల్ అప్‌డేట్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

Also Read :TheRajaSaab : రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెప్పిన విశ్వప్రసాద్

శ్రీలంకలో ఈ షూటింగ్ షెడ్యూల్ చురుకుగా పూర్తి చేసిన వెంటనే, ఈ సినిమా నుండి మొదటి సింగిల్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ మొదటి సింగిల్ పాటలో శ్రీలంకలో చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్‌ను జత చేయనున్నారు. దీంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Exit mobile version