Site icon NTV Telugu

Ram Charan : రామ్ చరణ్ గెస్ట్ రోల్..!

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన స్టార్ హీరో సినిమాలో అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందులో ఓ తెలుగు సీనియర్ స్టార్ హీరో ఉండగా.. ఇప్పుడు చెర్రీ కూడా కనిపించబోతుండడం విశేషం. ఇంతకీ చరణ్ ఏ హీరో కోసం గెస్ట్‌గా మారనున్నాడు.. బాలీవుడ్ ప్లాన్ నిజమేనా..!

గతంలో ఓ సారి బాలీవుడ్‌లో సినిమా చేసి.. సక్సెస్ కాలేకపోయారు రామ్ చరణ్. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. అన్ని విధాలుగా బాలీవుడ్ రీ ఎంట్రీ కలిసొస్తుందని భావిస్తున్నాడట. అందుకే ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న చరణ్.. అప్ కమింగ్ సినిమాలు కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్‌లో భారీగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అందుకోసం బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ సపోర్ట్‌తో రంగంలోకి దిగబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ క‌భీ దివాళి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులోనే చరణ్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌బోతున్నార‌ట‌.

ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. అది కూడా ఆచార్య సెట్స్‌లోనే చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. అందులోభాగంగా ఓ పాట‌ను తెర‌కెక్కిస్తున్నారట. ఈ పాట‌లోనే రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అందుకోసం సల్మాన్-చరణ్ అదిరిపోయే స్టెప్స్‌తో అలరించోబుతన్నారని టాక్. ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్త‌య్యింద‌ని అంటున్నారు. అయితే ఇప్పటికే చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’ చిత్రంలో సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు చరణ్.. సల్మాన్ కోసం గెస్ట్‌గా మారడం విశేషమనే చెప్పాలి. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version