NTV Telugu Site icon

Ram Charan : ‘గేమ్‌ ఛేంజర్‌’ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Gamechanger,

Gamechanger,

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. అటు చరణ్ ఫ్యాన్స్  ఇటు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

Also Read : Satyadev : జీబ్రా కలెక్షన్స్ లో భారీ జంప్.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి వచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ‘జరగండి’, ‘రా మచ్చా’ పాటలు యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక మరోసారి శ్రోతల్ని, అభిమానుల్ని కట్టి పడేసేందుకు మూడో పాటను రిలీజ్ చేయబోతోన్నారు. న్యూజిలాండ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై షూట్ చేసిన ఈ మెలోడీ గీతాన్ని నవంబర్ 28న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు అప్డేట్ ఇస్తూ వదిలిన పోస్టర్లో రామ్ చరణ్, కియారా ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న అమెరికాలో చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా నిర్వహించబోతున్నారు. గేమ్ చేంజర్ టీజర్‌తో అంచనాలు పెంచిన చిత్రయూనిట్ మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు రానుంది. రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు. సరిగమ ద్వారా గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ అవుతోంది.

Show comments