Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
- జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది'
- ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా 'పెద్ది' ప్రమోషన్స్
- చిన్న రిలీఫ్ కోసం చరణ్ వినూత్నమైన ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Jokes on Buchi Babu: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇటీవలే ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయగా.. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ ప్రమోషన్స్ జోరును మరింత పెంచుతూ.. మే 23న భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ దసరా మైదాన్‌లో ‘#PEDDIKiAawaz’ పేరుతో ఒక భారీ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.
పెద్ది సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ బిజీ షెడ్యూల్స్ నుంచి చిన్న రిలీఫ్ కోసం హీరో రామ్ చరణ్ ఒక వినూత్నమైన ప్లాన్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబును స్వయంగా తన కారులో డ్రైవ్‌కు తీసుకెళ్లారు. ఈ డ్రైవ్ సందర్భంగా చరణ్, బుచ్చిబాబుల మధ్య సినిమా షూటింగ్ విశేషాలు, వ్యక్తిగత అనుభవాలపై ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ఈ సరదా సంభాషణలో భాగంగా చరణ్ మాట్లాడుతూ.. గతంలో పెద్ది మేకింగ్ వీడియోలో బుచ్చిబాబు తన బైసెప్స్ చూపిస్తూ వైరల్ అయిన విషయాన్ని గుర్తుచేశారు. మరోసారి తన బైసెప్స్ చూపించాలంటూ బుచ్చిబాబును చరణ్ సరదాగా కోరారు. హీరో కోరిక మేరకు మరోసారి బైసెప్స్ చూపించారు. దీనికి స్పందించిన బుచ్చి.. చరణ్‌కు ఉన్న డెడికేషన్ చూసిన తర్వాతే తాను కూడా ఫిట్నెస్ వైపు అడుగులు వేశానని, రోజుకు కనీసం 40 నిమిషాలు వర్కవుట్ చేయడం ప్రారంభించానని తెలిపారు.
Also Read
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
ఈ క్రమంలోనే పెద్ది షూటింగ్ సమయంలో రామ్ చరణ్ పడిన కష్టాలు, బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. పాత్రల కోసం బుచ్చిబాబు తనను తీవ్రంగా టార్చర్ చేశాడంటూ చరణ్ నవ్వుతూ చెప్పారు. కథానుగుణంగా ఒకే సినిమాలో మొదట క్రికెటర్ బాడీ (తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య తరహాలో) కావాలని, ఆ తర్వాత కొద్ది రోజులకే ఇసుకలో ఎండల మధ్య ఫైట్లు చేసే పవర్ఫుల్ రెజ్లర్ బాడీ కావాలని బుచ్చిబాబు తనను డిమాండ్ చేశాడని చరణ్ వివరించారు. సినిమా టైమ్‌లైన్ తక్కువగా ఉన్నప్పటికీ.. కథపై ఉన్న ప్రేమతో బుచ్చిబాబు అడిగిన ప్రతి లుక్‌ను తీసుకురావడానికి తాను ఎంతో శ్రమించానని చరణ్ వెల్లడించారు. నీకో దండం బుచ్చి, నన్ను బాగా టార్చర్ చేశావ్ అని చరణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?