Tollywood : స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా.. సమ్మర్ 2025 విడుదల
- బన్నీ - సుక్కుల పుష్ప మరోసారి వాయిదా
- డిసెంబర్ విడుదల కానున్న అరడజను సినిమాలు
- కన్నప్ప డిసెంబర్ 6న వచ్చే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ ఆలు అర్జున్ హీరోగా జీనియస్డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా రానున్న చిత్రం పుష్ప-2. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ దశలో ఉన్నఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. షూటింగ్ పెండింగ్ ఉండడంతో డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు మరొక డేట్ ప్రకటించారు మైత్రీ మూవీస్. పుష్ప రాకతో డిసెంబరులో రావాల్సిన సినిమాలు పరిస్థితీ అయోమయంలో పడింది.
టాలీవుడ్ సర్కిల్స్ వినిపిస్తున్న న్యూస్ ప్రకారం పుష్ప -2 డిసెంబరు 6న విడుదల అవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ సగం షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది.బన్నీ, ఫహద్ పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఎడిటింగ్, డబ్బింగ్ పనిపనులను కనీసం మొదలు పెట్టలేదని టాక్. ఇటీవల బన్నీ దర్శకుడు సుకుమార్ లాంగ్ షెడ్యుల్ క్యాన్సిల్ చేసి విహార యాత్రలకు వెళ్లడం కూడా జరిగిపోయింది. ఇప్పటికిప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినా కూడా డిసెంబర్ నాటికి విడుదల కష్టమేనని ఈ నేపథ్యంలో 2025 వేసవికి రిలీజ్ చేసేలా మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సినీ సర్కిల్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి
Also Read
పుష్ప -2 వస్తే వెనక్కు వెళ్లాలనుకున్న సినిమాలు యధావిధిగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నితిన్ తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ అదే డేట్ కు రావచ్చు. ఇక గీతాఆర్ట్స్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘తండేల్’ నాగ చైతన్య హీరోగా వస్తోన్న ఈ చిత్రం పుష్ప రాకతో ఫిబ్రవరికి వెళ్లే ఆలోచన చేసారు. మంచు విష్ణు నటించిన కన్నప్ప కూడా డిసెంబర్ 6న వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప -2 విడుదల వాయిదా ఫై అధికారక ప్రకటన త్వరలోనే రానుంది.
Also Read: Nizam : మరొక ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని పంపిణీ చేయనున్న మైత్రీ మూవీస్
- Tags
- Allu Arjun
- Pushpa
- sukumar
- thandel
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!