NTV Telugu Site icon

Raksha Bandhan: అన్నా చెల్లెలి అనుబంధం.. తెలుగు సినిమాలకు మూలం

Untitled Design (9)

Untitled Design (9)

ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు మోజులో ఫ్యామిలీ ఓరియంటెడ్  సినిమాలు రావట్లేదు గాని  ఒకప్పుడు అన్నా –  చెల్లెలి కథాంశంతో సినిమా వచ్చిందంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే. అంతగా టాలీవుడ్ ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలను ఆదరించేవారు. మన టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకు అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాలతో హిట్ కొట్టిన హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం పదండి..

మెగాస్టార్ చిరంజీవి – 

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నా చెల్లెలి భావోద్వేగాల కథాంశంతో  మెగాస్టార్ నటించిన హిట్లర్  పెద్ద కమర్షియల్ హిట్. వరుస పరాజయాలకు బ్రేక్ ఇచ్చి చిరు కు సూపర్ సక్సెస్ అందించింది. రాబోతున్న విశ్వంభరలో కూడా అన్నా చెల్లి సెంటిమెంట్ కు బలమైన ప్రాధాన్యత ఉంటుందని ఐదుగురు సోదరీమణులకు అన్నయ్యగా చిరు కనిపిస్తున్నట్లు సమాచారం

నందమూరి బాలకృష్ణ – 

బాలయ్య నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా సమరసింహా రెడ్డి చెల్లెల్ల ప్రేమ కోసం తాపత్రేయ పడే అన్న పాత్రలో నటించి ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు.  అన్నయ అడిగితే ఐదవ తనాన్ని కూడా ఇచ్చేస్తానన్న చెల్లిని చూసి గర్వాంగా ఉందమ్మా అన్న డైలుగులు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాయి.

విక్టరీ వెంకటేష్ – 

వెంకీ మావయ్య హీరోగా నటించిన జయం మనదేరా చిత్రంలోని అన్నా చెల్లెలి అనురాగాలు ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక వెంకీ హిట్ చిత్రాలలో ఒకటైన గణేష్, వినాయక్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి, వాసు సినిమాలలోనూ సిస్టర్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది.

JR.NTR – 

రాఖీ పండగ అనగానే మొదట గుర్తొచ్చే సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో తారక్ నటించిన రాఖీ. మానవ మృగాల వేటలో హత్య గావింపబడిన ఎందరో చెల్లెల్ల ఆత్మ శాంతికై వేటాడే పులిలా తారక్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

పవన్ కళ్యాణ్ – 

భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అన్నవరం సినిమా అన్నయ్య, చెల్లెలి ప్రేమానురాగాల నేపథ్యంలో సాగుతూ హిట్ గా నిలిచింది.

రాజశేఖర్

రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమాకు కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేరంటే అతిశయోక్తి కాదు. హిట్లు లేక సతమతమవుతున్న రాజశేఖర్ కు సూపర్ హిట్ ను అందించిన చిత్రం గోరింటాకు.

అర్జున్ –

అర్జున్  హీరోగా నటించిన పుట్టింటికి రా చెల్లి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అత్తగారి ఇంట చెల్లెలు అనుభవించే కష్టాల నుండి చెల్లిని రక్షించే కథాంశంతో తెరకెక్కింది పుట్టింటికి రా చెల్లి.

ఇవే కాకుండా అర్జున్, ముద్దుల మావయ్య,  రక్త సంబంధం, శివరామరాజు, బంగారు గాజులు, చంటి, శౌర్యం, వీరభద్రఇలా చెప్పుకుంటూ పొతే టాలీవుడ్ లో అన్నా చెల్లెలి కథా నేపథ్యంలో వచ్చిన సినిమాలు, వాటి  హిట్ రేషియోలు చాలా ఎక్కువ. ఎప్పుడైనా తోడబుట్టిన చెల్లి, అక్క అన్నకు అండగా నిలబడితే విజయం తథ్యం అది సినిమా రంగం అయిన రాజకీయరంగం అయిన సరే.