Site icon NTV Telugu

రాజ్ కుమార్ హిరానీ, ఆమీర్ ఖాన్ ‘పీకే’ ఇక పై ‘భద్రం’!

Rajkumar Hirani's 'PK' now in NFAI Collection

2014లో రాజ్ కుమార్ హిరానీ రూపొందించిన సోషల్ సెటైర్ ‘పీకే’. ఆమీర్ టైటిల్ పాత్రలో విడుదలైన ఎంటర్టైనర్ మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తూ తీశారు. అయితే, ఇప్పుడు ఆ సినిమా తాలూకూ ఒరిజినల్ నెగటివ్స్ ని ‘నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా’(ఎన్ఎఫ్ఏఐ)లో భద్రపరిచారు. సినిమా సహ నిర్మాత, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ నెగటివ్స్ ను ఎన్ఎఫ్ఏఐ డైరెక్టర్ ప్రకాశ్ మగ్దుమ్ కి అందజేశాడు. అలాగే, ‘పీకే’ మూవీకి సంబంధించిన ఇతర రషెస్, స్టిల్ ఫోటోగ్రాఫ్స్, మేకింగ్ కు సంబంధించిన కంటెంట్ కూడా ఇక పై ఎన్ఎఫ్ఏఐలో భద్రపరచనున్నారు.

Read Also : సమంత ముంబైకి మకాం మార్చబోతోందా!?

‘’ఫిల్మ్ మేకర్స్ అందరూ, అమూల్యమైన సినిమాల్ని, వాటి ఒరిజినల్ నెగటివ్స్ ని… ఎన్ఎఫ్ఏఐ భద్రపరిచేందుకు సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే, భవిష్యత్ తరాల సినీ ప్రియులు వివిధ రకాల సినిమాల్ని చూడటం, అధ్యయనం చేయటం ఎంతో అవసరం…’’ అన్నాడు రాజ్ కుమార్ హిరానీ. ఇక ఎన్ఎఫ్ఏఐ డైరెక్టర్ ప్రకాశ్ ‘పీకే’ గురించి మాట్లాడుతూ… ‘‘2013-14లో మన దేశంలో ఫిల్మ్ మేకింగ్ లోకి డిజిటలైజేషన్ వచ్చింది. ఆ సమయంలో తీసిన చివరి సెల్యూలాయిడ్ మూవీస్ లో ‘పీకే’ ఒకటి. అందుకే, ఈ సినిమా మరింత ముఖ్యం’’అన్నాడు. ‘పీకే’ తరువాత బాలీవుడ్ లో దాదాపుగా అన్ని సినిమాలు నెగటివ్స్ లేకుండానే షూట్ చేస్తున్నారు…

‘పీకే’లాగే రాజ్ కుమార్ హిరానీ గత చిత్రాలు ‘మున్నాభాయ్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’ వంటివి ఇప్పటికే ఎన్ఎఫ్ఏఐ ఆర్కైవ్స్ లో భద్రపరచబడ్డాయి.

Exit mobile version