సమంత ముంబైకి మకాం మార్చబోతోందా!?

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకూ స్ట్రయిట్ హిందీ చిత్రంలో నటించలేదు. గత కొన్నేళ్ళుగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నా సున్నితంగా తిరస్కరించింది. కానీ హిందీ వెబ్ సీరిస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె నటించడం, దానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో ‘సమంత మనసు మార్చుకుంటోందా?’ అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఏ నటుడు, నటి అయినా… ఉన్నచోటనే ఆగిపోవాలని అనుకోరు. అవకాశం దొరకాలే కానీ తమ ప్రతిభను మరింత ఎక్కువ మంది ముందు ప్రదర్శించాలని, మరింత విస్తారంగా పేరు ప్రఖ్యాతులు గడించాలని కోరుకుంటారు. దీనికి తోడు సమంత కేవలం నటనకు పరిమితం కాకుండా గత కొంతకాలంగా సామాజిక కార్యక్రమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోకి విస్తరిస్తోంది. ఆ దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి మకాం మార్చితే తప్పేమిటనే ఆలోచన సమంత చేస్తుందని తెలుస్తోంది.

Read Also : నిర్మాతలను ఎగ్జిబిటర్స్ నియంత్రించగలరా!?

పూర్తి స్థాయిలో ముంబైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేయకపోయినా… కనీసం యేడాదిలో కొన్ని నెలలు అక్కడే గడపాలని సమంత అనుకుంటోందట. అందులో భాగంగా ముంబైలోని ప్రైమ్ లొకేషన్ లో ఓ ఇంటిని ఆమె కొనుగోలు చేయబోతోందని అంటున్నారు. ముంబైలోని పరిచయస్థుల ఆసరాతో ఇంటికై వేట మొదలెట్టిందట. ఇదిలా ఉంటే… ఇప్పటికే నాగ చైతన్య హిందీ చిత్రసీమ వైపు దృష్టి పెట్టాడు. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సహజంగానే చైతుకు మరిన్ని బాలీవుడ్ ఆఫర్స్ వస్తాయని సమంత భావిస్తోందట. అలానే ఆమె కూడా తన కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ మూవీ ఒకేసారి విడుదల కాబోతోంది. అలానే మరో పక్క ఇంకో వెబ్ సీరిస్ చేయడానికి సమంత అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి చూస్తే… సమంత ముంబైకి మకాం మార్చడంలో అర్థం ఉందనిపిస్తోంది. ఇప్పటికే సౌతిండియాకు చెందిన కొందరు హీరోయిన్లు, రామ్ చరణ్‌ వంటి హీరోలు ముంబైలో తమకంటూ సొంత ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో… సమంత కూడా వాళ్ళనే అనుసరిస్తోందని అనుకోవచ్చు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-