Site icon NTV Telugu

జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !

Rajinikanth’s Darbar Movie Premiers in Japan

తలైవా రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “ముత్తు” అక్కడ విడుదలై అద్భుతమైన విషయం సాధించింది. దీంతో అప్పటి నుంచి జపాన్ లో కూడా రజినీకి అభిమానగణం భారీగానే ఏర్పడింది. అందుకే తలైవా సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతాయి. తాజాగా రజినీకాంత్ మరో చిత్రం అక్కడ దుమ్ము రేపుతోంది. ఇండియాలో పొంగల్ కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ అయిన “దర్బార్” మూవీకి మంచి స్పందనే వచ్చింది. ఈ చిత్రాన్ని ఇటీవల జపాన్ లో ప్రదర్శించగా, అక్కడ అద్భుతమైన స్పందన వస్తోందని సమాచారం.

Read Also : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో

ఈ చిత్రం జపనీస్ వెర్షన్ ఇటీవల జపాన్ లోని ఎంకేసి ప్లెక్స్‌లో విడుదలైంది. ఈ నెల 21 వరకు అక్కడి థియేటర్లలో ‘దర్భార్’ తుఫాన్ కొనసాగుతుంది. ‘దర్బార్‌’లో రజినీకాంత్ తో పాటు నయనతార, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ప్రస్తుతం రజినీకాంత్ “అన్నాత్తే” సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ సిరుతై శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి “అన్నాత్తే” ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Exit mobile version