అప్పటి వరకు వరుస ఫ్లాప్ లతో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘జైలర్’ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రజినీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రజినీ కెరీర్ ఇక అయిపోయిందంటూ విమర్శలు చేసిన వారికి ఈ మూవీతో సూపర్‌స్టార్ మంచి కంబ్యాక్ ఇచ్చినట్లయింది. ఇందులో రజినీకాంత్ స్టైలిష్ యాక్టింగ్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ క్యామియో, అనిరుధ్ మ్యూజిక్ సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌కి మించేలా స్టార్ క్యాస్టింగ్ నుంచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా..
Also Read : Sonu Nigam : క్షమాపణ చెప్పినా కూడా వదలడం లేదుగా..
ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ సహా మరింతమంది స్టార్స్ కనిపించనుండగా వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి గాను రజినీకాంత్ అందుకుంటున్న రెమ్యునరేషన్ పై ఓ ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. సమాచారం ప్రకారం తలైవా ‘జైలర్ 2’ కోసం ఏకంగా రూ.260 కోట్లు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో కోలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్‌గా కూడా రజినీకాంత్ రెమ్యునరేషన్ రికార్డు మొత్తంలో ఒకటని చెప్పొచ్చు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.
