Coolie: మొత్తనికి సత్యరాజ్‌తో విభేదాలపై స్పందించిన రజనీకాంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘కూలీ’, ఆగస్టు 14న పాన్ ఇండియా లెవల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో.. నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్లు భాగం అయ్యారు. దాదాపుగా 370 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్లో మెరవనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : Bhagyashree : దీపికా, మృణాల్, రష్మిక, జాన్వీ తో పాటు భాగ్యశ్రీ..?
Also Read
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
- Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
అయితే రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్‌లో రజనీకాంత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. ‘సత్యరాజ్‌గారితో నాకు విబెదాలున్నా, ఆయన నిజాయితీగా మాట్లాడగల గొప్ప వ్యక్తి. అలాంటి వాళ్లను మనం నమ్మాలి. కానీ ప్రతి విషయం మనసులో పెట్టుకునే వాళ్లను మాత్రం నమ్మకూడదు’ అని తలైవా స్పష్టం చేశారు. ఈ విషయం పై తలైవా ఇలా స్పందించడం అందరిని షాక్ కి గురి చేసింది. అలాగే.. ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ గురించి చెబుతూ.. ‘లోకేష్ కథ చెప్పిన మొదటి రోజు నుంచే నాకు ఈ సినిమా స్పెషల్ అనిపించింది’ అని అన్నారు. కింగ్ నాగ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇక ఈ వయసులోనూ ఆయన ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నారు. నా జుట్టంతా ఊడిపోయింది. మీ ఫిట్నెస్ రహస్యం ఏమిటంటే, వ్యాయామమే అంటారు. ఈ సినిమాలో ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు’ అని ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, “ఎంత డబ్బు, పేరు వచ్చినా ఇంట్లో మనశ్శాంతి, బయట గౌరవం లేకపోతే జీవితం లాభం లేదు” అంటూ హృదయాన్ని తాకే మాటలు చెప్పారు. దీంతో ‘కూలీ’ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉండగా, ఈ ఎమోషనల్ కామెంట్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!