Site icon NTV Telugu

Rajinikanth : రజనీకాంత్ రిటైర్మెంట్‌ పై.. తలైవా భార్య ఇండ్రస్టింగ్ కామెంట్స్

Rajinikanth

Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వరుస చిత్రలో ‘కూలీ’ ఒకటి. ప్రజంట్ ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్‌ను ముగించేశారు. బ్యాలెన్స్ వార్క్ కూడా లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఇక ఈ మూవీతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటు కూలీ, జైలర్ 2 వంటి ప్రధాన చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు తలైవా. ఇలాంటి సమయంలో రీసెంట్ గా రజినీ కాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మరో హీరో ?

దేనికైనా రిటైర్‌మోంట్ ఉంటుంది, కానీ ఇండస్ట్రీలో నటినటలకు మాత్రం రిటైర్ మోంట్ ఉండదు. అక్కినేని నాగేశ్వర్ రావు దీనికి నిదర్శనం. ఆయన తుది శ్వాస విడిచే వరకు నటించారు. అలాంటిది తలైవా విశ్రాంతి తీసుకోవడం ఎంటీ ? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన సతిమని రియాక్ట్ అయ్యారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ సినిమా షూటింగ్ నుంచి విరామం తీసుకునే అవకాశం ఉందా అని ఒక విలేకరి లత ను అడిగితే.. ‘ నాకు సమాధానం తెలిస్తే బాగుంటుంది. నేను మీకు కచ్చితంగా చెప్పేదాన్ని’ అని ఆమె చెప్పింది. అంటే ఆమె మాటలు బట్టి చూస్తే రజినీ కాంత్‌కు అసలు విశ్రాంతి తీసుకునే ఆలోచనే లేనట్లుగా కోడుతుంది.

Exit mobile version