Site icon NTV Telugu

Rajnikanth : దసరా రేస్ నుండి రజనీకాంత్ సినిమా ఔట్..!

Untitled Design (16)

Untitled Design (16)

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సూపర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది. చాల కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా T.G జ్ఙానావెల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌‘ అనే చిత్రం తెరకెక్కుతోంది. రజనీకాంత్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఎప్పుడు రెలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ నిర్మాణ సంస్థ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో నిరుత్సాహం గా ఉన్నారు. మొదట వెట్టయాన్‌ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ భావించింది నిర్మాణ సంస్థ. కానీ ఇప్పుడు తమిళ సినీ వర్గాల నుండి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ప్రకటన రానుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో పాటు రజనీకాంత్ మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ చిత్రంలోను సూపర్ స్టార్ నటిస్తున్నారు. ఇటీవల కూలి ఫస్ట్ గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన లభించింది.

Also Read : Nayanatara : యంగ్ హీరో సరసన నయనతార..ఎవరా హీరో ..?

Exit mobile version