సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీర్తి కిరీటంలో తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో మరో కలికి తురాయి చేరింది. సహజంగా జాతీయ సినిమా అవార్డులను, పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందిస్తారు. అయితే ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ తో పాటు సినిమా రంగానికి చెందిన అవార్డు గ్రహీతలు పురస్కారాలను అందుకున్నారు. తాజాగా రజనీకాంత్, ఆయన శ్రీమతి లత న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ఫోటోలతో పాటు ట్వీట్ చేస్తూ, ‘గౌరవనీయులైన రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలవడం మరియు అభినందించడం చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలిసిన తలైవా!
