Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ బస్ కండక్టర్ గా జీవితాన్ని మొదలుపెట్టి నేడు ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. రజనీ అంటే ఒక స్టైల్ రజనీ అంటే ఒక ఎమోషన్.. రజనీ అంటే స్వాగ్.. ఎంతటి సూపర్ స్టార్ గా ఎదిగిన ఒదిగి ఉండడం రజనీకే చెల్లింది. ఆలాంటి ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఇందుకోసమే రజనీ జీవిత ప్రయానాన్ని త్వరలోనే ఆత్మకథ రూపంలో పాఠకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అధికారికంగా స్పష్టం చేశారు.
రజనీకాంత్ తనఆత్మకథను స్వయంగా తానే రచిస్తున్నారని, ఈ రచన ఎంతోమందికి గొప్ప స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో రజనీకాంత్ సాధించిన అద్భుత విజయాలు, ఆయన వ్యక్తిగత జీవితం, ఒక సామాన్య స్థాయి నుండి భారతీయ చిత్రసీమలోనే టాప్ స్థానానికి చేరుకోవడానికి ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లు ఈ పుస్తకంలో పొందుపరచనున్నట్లు తెలిపారు. “నాన్నగారి జీవితకథ రాబోయే తరాలకు పాఠం లాంటిది. ఒకవేళ భవిష్యత్తులో ఈ ఆత్మకథను సినిమాగా తీస్తే మాత్రం అది చాలా ప్రత్యేకం, విశిష్టమైన ప్రాజెక్ట్‌గా నిలిచిపోతుంది” అని సౌందర్య పేర్కొన్నారు. మరోవైపు, రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌తో పాటు తన కొత్త చిత్రం ‘ధర్మన్’ సెట్స్‌లో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతున్నప్పటికీ కాస్త సమయం ఖాళీ దొరికినా తన ఆత్మకథను రాయడానికే కేటాయిస్తున్నారని ఆమె వెల్లడించారు. మరి రజనీ ఆత్మకథలో ఎలాంటి విషయాలు ఉంటాయో చూడాలి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!