హైదరాబాద్ ఐకియా వద్ద సూపర్ స్టార్ రజినీకాంత్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘అన్నాత్తే’ బృందం ఈరోజు హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. నగరంలోని ఐకియా స్టోర్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఐకియా స్టోర్ వద్ద జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ‘అన్నాత్తే’ ప్రధాన పాత్రధారులలో ఒకరైన లేడీ సూపర్ స్టార్ నయనతార ఈరోజు హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ఆమె రేపు సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. రజనీకాంత్‌తో ఆమె కాంబినేషన్ సన్నివేశాలు మరికొన్ని రోజులు చిత్రీకరించబడతాయని తెలుస్తోంది. కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!