Site icon NTV Telugu

Coolie: రికార్డులు బద్దలు కొట్టాలని భావించాం, బద్దలయ్యాయి.. కూలీ రిజల్ట్ పై నాగార్జున కీలక వ్యాఖ్యలు

Nagarjuna Coolie

Nagarjuna Coolie

రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ పాత్రలో నటించిన ‘కూలీ’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. ముందు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, “ఇది రజనీకాంత్ చేయాల్సిన సినిమా కాదు, లోకేష్ కనకరాజు స్టాండర్డ్‌కు తగ్గ సినిమా కాదు,” అని విమర్శలు వచ్చాయి. అలాగే, నాగార్జున పాత్ర విషయంలో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. “నాగార్జున ఇలాంటి పాత్ర చేస్తాడని ఊహించలేదు,” అని కొందరు అంటే, “ఇందులో కొత్తగా చేసేదేముంది? రొటీన్, రెగ్యులర్ విలన్ పాత్రే కదా!” అని మరికొందరు కామెంట్స్ చేశారు. అయితే, ఈ విషయంపై నాగార్జున ఆసక్తికరంగా స్పందించాడు. ఈ మేరకు అక్కినేని అన్నపూర్ణ స్టూడియో సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

Also Read:CPI Ramakrishna: ఆర్ఎస్ఎస్కు స్వాతంత్య్ర సంగ్రామంతో ఎలాంటి సంబంధం లేదు

“‘కూలీ’ సినిమాలో రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం ఒక మరపురాని అనుభవం. మా ఇద్దరి విభిన్న సినీ ప్రయాణాలు తెరపై కలిసినప్పుడు ఒక మాగ్నెటిక్ మ్యాజిక్ క్రియేట్ అయింది. మేము ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు మాకు తెలుసు. నా పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అద్భుతమైనది,” అని నాగార్జున తెలిపారు.ఆయన మాట్లాడుతూ, ఒక గొప్ప సినిమా అనేది నటుల మధ్య ఉన్న కెమిస్ట్రీ, ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే థ్రిల్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. “‘కూలీ’ సెట్స్ నుంచి థియేటర్ల వరకు ఒక వారసత్వం, రీక్రియేషన్ వేడుకగా నిలిచింది. రికార్డులు బద్దలు కొట్టాలని మేము భావించాం, అవి బద్దలయ్యాయి,” అని ఆయన చెప్పారు.

Exit mobile version