టాలీవుడ్ లో ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా ఫెస్టివల్ రాబోతుంది. టాలీవుడ్ మరియు కోలీవుడ్ కి చెందిన ముగ్గురు స్టార్ హీరోల మోస్ట్ అవైటెడ్ చిత్రాలు అక్టోబర్ రేసులో నిలిచాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అధికారికంగా ఖరారవ్వడంతో బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రేస్ లో మొదటగా విక్టరీ వెంకటేష్ స్టార్ట్ చేయబోతున్నాడు. వెంకీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతోంది.
ఇక ఆ తర్వాత వచ్చే దసరా కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల మధ్య మహా సంగ్రామం జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ పవర్ ఫుల్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. జైలర్ హిట్ కావడంతో జైలర్ 2పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లిమ్స్ అదిరింది. ఇక జైలర్ 2కి సరిగ్గా ఒక్క రోజు వ్యవధిలోనే అంటే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానుంది. ఈ మూడు భారీ చిత్రాల పోటీతో అక్టోబర్ నెల థియేటర్లలో మాస్ జాతర ఖాయమని చెప్పవచ్చు

