Site icon NTV Telugu

The Rajasaab : రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ కన్ఫామ్ చేసేసారుగా?

The Rajasaab

The Rajasaab

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన  వచ్చింది.

కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొద్దీ రోజులగా రోజుకొక డేట్ ఫినిపిస్తోంది. వాస్తవంగా ఈ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేస్తామని గతంలోనే అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. కానీ ఇప్పడు ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడంతో రిలీజ్ వాయిదా అని పుకార్లు షికార్లు చేసాయి. ఇదిలా ఉండగా ప్రముఖ థియేటర్ చైన్ సంస్థ PVRINOX తమ బుకింగ్స్ యాప్ లో రాజాసాబ్ ను 2026 జనవరి 9 రిలీజ్ అని పోస్టర్ పెట్టేసింది. ఇటివల చిత్ర నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంక్రాంతి కానుకగా జనవరిలోనే రిలీజ్ చేయమని కోరారు అని అన్నారు. ఆ విషయంపై ఆలోచిస్తున్నాం అని అన్నారు. ఇప్పుడు PVRINOX కూడా జనవరి 9 అని డేట్ తో సహా పెట్టేసింది. ఈ లెక్కన రాజసాబ్ జనవరి 9నే రిలీజ్ అనేది దాదాపు ఫిక్స్ అనే అనుకోవాలి.

Exit mobile version