డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.
Also Read : JUNIOR : జూనియర్ పక్కన నటించేందుకు శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.?
అయితే రాజాసాబ్ మళ్ళి వాయిదా పడుతుందని డిసెంబరులో రిలీజ్ అవదు అని సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపించాయి. దాంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త డిజప్పోయింట్ అయ్యారు. మరోసారి వాయిదా ఎందుకు అని మారుతీని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేసారు. ఉన్నట్టుండి ఈ రూమర్స్ ఎవరు క్రియేట్ చేశారనే చర్చ నడించింది. యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం అసలు సంక్రాంతి రిలీజ్ అనేది జోక్. ప్రస్తుతం సాంగ్స్ షూట్ చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లో టోటల్ షూట్ ఫినిష్ అవుతుంది. మరోవైపు నాన్ థియేటర్ అమ్మకాలు కూడా స్టార్ట్ చేసారు. ఓటీటీ నుండి ఏదైనా డిమాండ్ చేస్తే తప్ప సంక్రాంతి అనే ఆలోచన లేదు. ఎట్టి పరిస్థుతుల్లో డిసెంబరు డేట్ మిస్ అవదు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. డిసెంబరు రిలీజ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయని తెలిసింది. ఇటీవల విడుదలైన రాజాసాబ్ గ్లిమ్స్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.