NTV Telugu Site icon

Rajamouli – Rashmi: రష్మితో రాజమౌళి ఫ్లర్టింగ్.. వీడియో చూశారా?

Rashmi Rajamouli

Rashmi Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ మొదటి నుంచి చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖుంగా ఆయన చేసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు వరల్డ్​వైడ్​గా క్రేజ్ సంపాదించారు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో అప్పుడప్పుడు స్క్రీన్​పై కూడా మెరుస్తుంటారు. వేరే వాళ్ళ సినిమాల్లో కూడా అవసరానికి గెస్ట్​ రోల్స్​లో కనిపించి ఆయనలోని నటన స్కిల్స్​ చూపిస్తుంటారు. అయితే ఆయన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్​తో కలిసి నటించారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అది పెద్ద విషయం కాదు కానీ వాళ్లిద్దరి మధ్య లవ్​ట్రాక్ సీన్స్​ ఉండడం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడు నటించారని? ఆశ్చర్యపోతూ ఆరా తీస్తున్నారు.

PVR INOX: సినిమా ముందు యాడ్స్ వేసినందుకు లక్ష ఫైన్

ఇంతకీ ఆ వీడియో ఏంటంటే? విక్రమార్కుడు సినిమా రిలీజ్ టైంలో స్టార్ మా(అప్పటి మా టీవీ) ‘యువ’ అనే తెలుగు సీరియల్ వచ్చేది. ఆ సీరియల్​లో రష్మీ రేడియో జాకీ పాత్రలో నటించగా విక్రమార్కుడు ప్రమోషన్స్​లో భాగంగా రాజమౌళి ఆ సీరియల్​లో గెస్ట్​ రోల్​లో మెరిశారు. ఈ క్రమంలోనే ఆయన రష్మీతో కలిసి ఒక లవ్ ట్రాక్ లో నటించారు. ఈ సీన్​లో రష్మీని ప్రేమించే వ్యక్తిగా ఆయన్ని చూపారు. ఎందుకు వైరల్ అవుతుందో తెలియదు కానీ ఆ సీన్​కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో రష్మీతో జక్కన్న ‘లవ్​ స్టోరీ’, ‘రాజమౌళి- రష్మీ ఎప్పుడు నటించారు?’, ‘ఈ లవ్ ట్రాక్​ భలే ఫన్నీగా ఉంది’ అంటూ నెటిజన్ల కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.