Site icon NTV Telugu

Rajamouli : దర్శకుడు అనిల్ రావిపూడిపై ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా..

Whatsapp Image 2024 05 02 At 8.22.23 Am

Whatsapp Image 2024 05 02 At 8.22.23 Am

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‍కు దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, అనిల్ రావిపూడి మరియు గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరయ్యారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కృష్ణమ్మ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా జరిగిన కృష్ణమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ సాగింది.అయితే దర్శక ధీరుడు రాజమౌళి తన తరువాత సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

తాజాగా ఆ సినిమా ఓపెనింగ్ ఎప్పుడో రాజమౌళి గారు చెప్పాలని అనిల్ రావిపూడి అడిగారు.అలాగే దేవర సినిమా గురించి అప్డేట్ కావాలని దర్శకుడు కొరటాల శివను కూడా ప్రశ్నించారు.అయితే రాజమౌళి గురించి మాట్లాడుతూ.ఆయన ఓపెనింగ్ డే రోజున తాను తీసే సినిమా కథ ఎలా ఉంటుంది ఏ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు అనేది చెబుతారు.ఆయన తరువాత సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని అనిల్ రావిపూడి అన్నారు.దీనితో రాజమౌళి సరదాగా స్పందించారు.. దర్శకుడు అనిల్ రావిపూడిని ఎవరైనా సరే. ఓ కెమెరా పట్టుకొని..వెనకాలే నడుస్తూ.. ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తాను” అని రాజమౌళి సరదాగా అన్నారు.అయితే రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌పై అనిల్ రావిపూడి సరదాగా స్పందించారు. “దయచేసి ప్రైజ్‍మనీ తగ్గించండి సర్. ఓ రెండు రూపాయలని చెప్పండి. 10వేలు అంటే నిజంగా వచ్చేస్తారు” అని అనిల్ స్పందించారు.

Exit mobile version