Site icon NTV Telugu

Raj Tarun: తమిళ్ ‘గోలీసోడా’ కొట్టేందుకు రెడీ అయిన రాజ్ తరుణ్

Raj Tarun

Raj Tarun

టాలీవుడ్ యూత్‌ఫుల్ హీరో రాజ్ తరుణ్‌ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు! ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్‌ , ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్తా మామ’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో అభిమానులను ఫిదా చేశాడు. ఒక్కో సినిమాతో వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఆకట్టుకునే రాజ్ తరుణ్ ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

Read More:Samantha : నేను హాట్ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు : సమంత

ఈ రోజు రాజ్ తరుణ్ పుట్టినరోజు స్పెషల్‌గా, అతని కొత్త సినిమా డీటెయిల్స్‌ను మేకర్స్ గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడు విజయ్ మిల్టన్! ఈయన తమిళంలో విజయ్, అజిత్ వంటి టాప్ స్టార్స్‌తో 43కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన స్టార్ టెక్నీషియన్. అంతేకాదు, ‘గోలీసోడా’, ‘గోలీసోడా 2’, ‘భైరాగి’, ‘కడుగు’ వంటి హిట్ సినిమాలతో డైరెక్టర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజ్ తరుణ్‌ని కోలీవుడ్‌కి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, ‘గోలీసోడా’ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Read More:TFI: టీఎఫ్ఐ బానిసల కళ్ళు జిగేల్ మనే ఫ్రేమ్.. కుర్ర డైరెక్టర్లు అంతా ఒకే చోట!

రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ టోటల్‌గా కొత్త లుక్‌లో, సరికొత్త యాక్షన్ అవతార్‌లో అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ఈ మూవీ యాక్షన్‌తో కూడిన ఫుల్‌-ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేతో రూపొందనుంది. రాజ్ తరుణ్‌ని కోలీవుడ్‌లో గ్రాండ్‌గా, స్టైలిష్‌గా లాంచ్ చేసే ఈ సినిమా అభిమానులకు కచ్చితంగా ఓ విజువల్ ట్రీట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.

Exit mobile version